ప్రభుత్వ భూములే టార్గెట్ ప్రజాప్రతినిధులే ‘భూ’ బకాసురులు

ప్రభుత్వ భూముల పరిరక్షణ మరిస్తే అక్రమాలు ఆక్రమణలు ఎక్కువై ప్రజలు నష్టపోయే పరిస్థితి వస్తుంది పక్కాగా కన్నేసి ఒక ప్రణాళిక బద్ధంగా కబ్జా చేసేందుకు ప్లాన్ వేసుకొని సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే జడ్పిటిసి వీరందరూ తమ తమ అనుచరుల చేత భూమి మీద కబ్జాలు పెట్టిస్తుంటారు ఇదే తరహా కబ్జా సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ గ్రామపంచాయతీ లోని 496 సర్వేనెంబర్ ఈ సర్వే నెంబర్ కు సంబంధించి 500 ఎకరాలకు పైగా ఉంది ఇందులో కొంతమంది రైతులకు మరికొంతమంది ఎక్స్ సర్వీస్ మాన్ లకు మరికొంత ఫ్యాక్టరీలకు ఇచ్చి ప్రభుత్వం మరికొంత భూమిని లీజుకు రాసిచ్చిన దాఖలాలో ఉన్నాయి ఇవన్నీ పోగా 250 కి పైగా ఎకరాల భూమి అక్రమార్కుల చేతిలో పడి ప్రభుత్వ భూమిగా ధరణిలో పేర్కొనబడింది ఈ ధరణిలో పేర్కొనబడిన ప్రభుత్వ భూమిని రాజకీయ నాయకులు వారి వారి అనుచరుల గణాన్ని రాత్రికి రాత్రి దింపి కావలసిన చోటఆక్రమణలు చేస్తుంటారు పగల అయితే తాసిల్దార్ కార్యాలయం నుండి వచ్చిన వాళ్లు పడగొట్టి ఇబ్బంది పెడతారేమోనని ఆలోచన చేసి రాత్రులు ఆదివారాలు పండుగ రోజులు వీటన్నిటిని చూసుకొని భూమిని చదును చేసుకుని అకస్మాత్తుగా కట్టడాలు లేపేస్తారు ఈ కట్టడానికి పర్మిషన్లు ఉండవు కానీ పంచాయతీ నుంచి అభయహస్తం మాత్రం ఉంటుంది. పంచాయతీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో వార్డు మెంబర్లు సర్పంచ్ జెడ్పిటిసి ఎంపిటిసిలు వారి వారి వర్గాలకు సంబంధించిన అనుచరులకు సంబంధించిన ఇండ్లను పంచాయతీ మీటింగ్ లో పెట్టి అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ఆ అనుమతిని అడ్డుపెట్టి సదరు కరెంటు ఏఈ దగ్గర దరఖాస్తు పెట్టి మీటర్లు పెట్టించుకుని కరెంటు తెచ్చు కుంటారు. అక్కడి నుంచి వారి ఆక్రమణ చేసిన పని అయిపోతుంది ఆ తర్వాత రాజకీయ నాయకుల జేబులోకి డబ్బులు వెళ్ళిపోతాయి ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తాసిల్దార్ వీరందరూ ఏం చేస్తున్నారు వారి డ్యూటీలు వారు చేస్తున్నారు కనపడితే మందలిస్తరు కనపడకుండా చేసుకుంటే వారి పని వారు చేస్తారు అన్న చందంగా భూమిని ఆక్రమణ చేసి సంవత్సరానికి కొంత చొప్పున ఎల్ఆర్ఎస్ తెచ్చుకొని పర్మినెంట్ చేసుకుంటారు ఇలా ఇస్లాపూర్ లోని సర్వే నెంబర్ 496లో కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయి సర్పంచ్ అండ దండలతో ఎమ్మెల్యే అభయహస్తంతో ఈ ఆక్రమణ లు జరుగుతున్నాయి ప్రజలు అనుకొంటున్నారు.




