
అశ్విన్ & రమేష్.కె సమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం “రూమ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామారాజ్ చేతుల మీదుగా” రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీరితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. గ్యాంగ్ లీడర్ నుండి ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి సుబ్బారావు.ఏ సినిమా చేసినా ఏది ఆడుతుంది, ఏది ఆడదు,ఎంత కలెక్షన్ చేస్తుంది అని క్యాలిక్యులేషన్ చేసి చెపుతాడు.గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్న తను ఈ మధ్య వచ్చిన “అఖండ” సినిమాను అనౌన్స్ చేసిన రోజునే ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని రాయలసీమ హక్కులను తీసుకోవాలని ముందుకు వచ్చాడు. అంత పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ఈ రోజు రూమ్ సినిమా చేస్తున్నాడు అంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పచ్చు. నిర్మాత రామరాజు గారి అబ్బాయిని హీరోగా, మనో చిత్రను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకొని చాలా మంచి టెక్నిషియన్స్ పెట్టుకొని ఈ సినిమా తీశాడు. మంచి కంటెంట్ తో వస్తున్న “రూమ్” సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.




