పూజా కార్యక్రమాలతో “తలకోన” చిత్రం ప్రారంభం

మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో “తలకోన” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.
ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… ఈ రోజే చిత్రాన్ని ప్రారంభించాము. చాలా సినిమాలతో నేను మీకు సూపరిచమే.. ఇప్పుడు ఈ ‘తలకోన’ చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము.. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా రూపొందిస్తున్నాము.. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రానుంది. ఈ తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్ లో మరో 20 రోజులు తలకొనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము అని తెలిపారు.




