“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. విడుదలకు సిద్దమైన చిత్ర టీజర్ ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు చిత్ర టీజర్ లాంచ్ చేశారు. వీరితో పాటు నిర్మాత పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా..ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గారు మాట్లాడుతూ.. తరతరాలనుండి వస్తున్నదే ఫ్రెండ్ షిప్. ఇప్పుడు “దోస్తాన్’ పేరుతో వస్తున్న ఈ చిత్ర టీజర్ బాగుంది.మంచి కథను సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించిన దర్శక,నిర్మాత సూర్యనారాయణకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమాకు పని చేసిన టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుతూ ఆల్ ద బెస్ట్ తెలిపారు.




