సినిమాలు

డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న మా ‘లక్కీ లక్ష్మణ్’

డిసెంబ‌ర్ 30న రిలీజ్ అవుతున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సోహైల్

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ ఫేమ్స్‌.. మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా…

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘మనందరికీ సోహైల్ సుపరిచితుడే. తను హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని మనం ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. న‌టుడిగా త‌ను రాణిస్తాడ‌ని భావిస్తున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేసినప్పుడే ఎక్కువ వైవిధ్య‌మైన సినిమాలు వ‌స్తాయి. దర్శకుడు అభిగారిని, నిర్మాత హరితగారికి అభినందనలు’’ అన్నారు.

దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ముందు నేను టెక్నీషియ‌న్‌ని. త‌ర్వాతే న‌టుడిని. నిర్మాత హ‌రిత‌గారు చాలా హ్యాపీగా ఉంటారు. డైరెక్ట‌ర్ అభిగారు కూల్ ప‌ర్స‌న్‌. క్లారిటీతో సినిమాను పూర్తి చేశారు. మంచి క‌థ‌, ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ ఉంది. త‌న నెక్ట్స్ సినిమా క‌థ కూడా తెలుసు. చాలా బావుంది. అభి మంచి డైరెక్ట‌ర్ అవుతారు. నిర్మాతగా హ‌రిత‌గారు మంచి లాభాల‌ను సాధించాలి. బిగ్ బాస్‌ను నేను పెద్ద‌గా చూడ‌ను. మా భార్య బిగ్ బాస్‌ను చ‌క్క‌గా ఫాలో అవుతుంది. సోహైల్ హీరో అని చెప్ప‌గానే ఆమె చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. తొలి రోజున త‌న‌తో క‌లిసి ఎమోష‌న‌ల్ సీన్‌లో న‌టించాను. సోహైల్ అద్భుతంగా న‌టించాడు. త‌ను భ‌విష్య‌త్తులో పెద్ద యాక్ట‌ర్ అవుతాడ‌ని చెప్పాను. అన్నీ ఎలిమెంట్స్ చ‌క్క‌గా కుదిరాయి’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker