
పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో శరవేగంతో ఓ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.. హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రానికి సంబంధించి పెద్ద సెట్టులో , ఒకవైపు ‘పింక్’ రీమేక్ చేస్తూనే మరోవైపు క్రిష్ చిత్రాన్ని కూడా పవన్ లాగించేస్తున్నారు…చిత్రం తో బిజీగాఉన్న పవన్
ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని వార్తలొస్తుండగా తాజాగా ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వేసవిలో ఈ చిత్రం విడుదలకానుందని సమాచారం. అయితే ఈ చిత్ర టైటిల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతని యూనిట్ ఇవ్వకపోయినప్పటికీ ‘విరూపాక్ష’ పవన్‌కి విభిన్నమైన టైటిల్ అవుతుందని అభిమానులు చెపుతున్నారు. మరి ఏం చెప్తారో చూద్దాం.



