Allజాతీయ వార్తలు

బంధుత్వం స్థానంలో కేరాఫ్…..ఆధార్ లో కీలక మార్పులు

ఆధార్ కార్డులో బంధుత్వాలకు కేంద్రం మంగళం పాడనున్నట్లు తెలుస్తోంది. సన్నాఫ్, డాటరాఫ్, వైఫాఫ్‌లకు స్వస్తి పలకనుంది. దాని స్థానంలో కేరాఫ్‌లను కేంద్రం తెరపైకి తెచ్చింది. అంటే భవిష్యత్‌లో భారతీయుడనని చెప్పుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎన్ఆర్సీ అమలు నేపథ్యంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఈ కొత్త విధానం తీసుకొచ్చిన్నట్లు సమాచారం. అంటే ఎన్‌ఆర్సీ అమల్లోకి వస్తే ఎవరికి వారే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఆధార్‌తోనే కాకుండా త్వరలో పాస్ పోర్టులో కూడా మార్చులు తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంధుత్వం స్థానంలో కేరాఫ్ వస్తుందంటూ తాజాగా యూఐడీఏఐ వైబ్‌సైట్లో పొందుపరిచింది.

ఆధార్‌లో ఇక తల్లిదండ్రులు, భర్తల పేర్లు ఉండకపోవచ్చు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా కార్డులలో ‘సన్నాఫ్’, ‘వైఫ్ ఆఫ్’, ‘డాటరాఫ్’ అని నమోదు చేసేవారు. ఇప్పుడు వాటిని తొలగించి కొత్తగా ‘కేరాఫ్’ అన్నదానిని తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.  

ఇక నుంచి కొత్తగా ఆయా కార్డులకు దరఖాస్తు చేసే వారు మునుపటిలానే అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా జారీ అయ్యే కార్డుల్లో మాత్రం బంధుత్వానికి సంబంధించిన వివరాలు ఉండవు. అంతేకాదు ఆధార్, పాస్‌పోర్టుల మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే వారి కార్డుల్లోని పాత డేటాను కూడా తొలగించనున్నారు.

సీఏఏ, ఎన్నార్సీల అమలుపై పట్టుదలగా ఉన్న కేంద్రం ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker