Allఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో ‘దిశ’ పోలీస్ స్టేషన్…

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రిబ్బర్ కట్ చేసి స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, మంత్రులు తానేటి వనిత, సుచరిత, మోపిదేవి వెంకటరమణ, డీజీపీ గౌతం సవాంగ్, వైసీపీ మహిళా
ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అలాగే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తరలివచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.




