జాతీయ వార్తలుముఖ్యాoశాలు

87 మందికి విశిష్ట సేవలో….648 మందికి మెరిటోరియస్‌ సేవలో…… రాష్ట్రపతి పతకాలు

దేశవ్యాప్తంగా 347 మందికి శౌర్య పతకాలు, 87 మందికి విశిష్ట సేవలో రాష్ట్రపతి పతకాలు, 648 మందికి మెరిటోరియస్‌ సేవలో రాష్ట్రపతి పతకాలు వరించాయి. స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో అందజేసే ఈ పథకాల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు పోలీసులకు శౌర్య పతకాలు వరించాయి. విశిష్ట సేవలో ఒకరికి, మెరిటోరియస్‌ సేవలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు లభించాయి. తెలంగాణకు చెందిన పోలీసులకు విశిష్ట సేవలో ఇద్దరికి, మెరిటోరియస్‌ సేవలో 12 మందికి రాష్ట్రపతి పతకాలు వరించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మండల హరికుమార్‌ (ఎఎసి), ముర్రే సూర్య తేజ (జెసి), పువ్వల సతీష్‌ (జెసి)లకుశౌర్య పతకాలు వరించాయి. విశిష్ట సేవలో ఎపి చెందిన పి.వెంకటరామి రెడ్డి (ఐజిపి), తెలంగాణకుచెందిన మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ (ఎడిజిపి), దేవేంద్ర సింగ్‌ (ఎస్‌పి)లకురాష్ట్రపతి పతకాలు దక్కాయి. మెరిటోరియస్‌ సేవలో ఎపికి చెందిన జె.శాంతారావు (ఆర్‌ఐపి), వి.నారాయణ మూర్తి (ఎస్‌ఐ)లకురాష్ట్రపతి పతకాలు వరించాయి.  మెరిటోరియస్‌ సర్వీస్‌లో తెలంగాణకు చెందిన ఎఆర్‌ శ్రీనివాస్‌ (ఐజిపి), పాలేరు సత్యనారాయణ (ఎఎస్‌పి), పైళ్ల శ్రీనివాస్‌ (ఎఎస్‌పి), సాయిని శ్రీనివాసరావు (ఎసిపి), సురడా వెంకట రమణ మూర్తి (డిఎస్‌పి), చెరుకువాసుదేవ రెడ్డి (డిఎస్‌పి), గంగిశెట్టి గురు రాఘవీరంద్ర (డిఎస్‌పి), చిప్ప రాజమౌళి (ఎస్‌ఐ), కాట్రగడ్డ శ్రీనివాసు (ఎఎస్‌ఐ), జంగనుగారి నీలం రెడ్డి (ఎఆర్‌ఎస్‌ఐ), సలేంద్ర సుధాకర్‌ (ఎఆర్‌ఎస్‌ఐ), ఉండింటి శ్రీనివాస్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌)లకురాష్ట్రపతి పతకాలు వరించాయి. మెరిటోరియస్‌ సర్వీస్‌లో తెలంగాణకు చెందిన జె.వీరాస్వామి (చీఫ్‌ హెడ్‌ వార్డెర్‌), వలదాసు జోషఫ్‌ (హెడ్‌ వార్డెర్‌)లు కరెక్షనల్‌ సేవా పతకాలను సొంతం చేసుకున్నారు. మెరిటోరియస్‌ సర్వీస్‌లో తెలంగాణకు చెందిన ఎర్రగుంట వెంకటేశ్వరరావు (లిడింగ్‌ ఫైర్‌మెన్‌), పరీద్‌ షేక్‌ (లిడింగ్‌ ఫైర్‌మెన్‌)లకుఫైర్‌ సర్వీస్‌ రాష్ట్రపతి మెడల్‌ వరించాయి. మెరిటోరియస్‌ సర్వీస్‌లో తెలంగాణకుచెందిన హోం గార్డ్‌లు చల్లా అశోక్‌ రెడ్డి, చందాసురేష్‌, ఎండి. అబ్దుల్‌ షుకుర్‌ బైగ్‌లకుహోం గార్డ్‌ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ రాష్ట్రపతి మెడల్స్‌ దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 మంది సిబిఐ అధికారులుపోలీసు పతకాలకు ఎంపికైనట్లు సిబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. బగ్గు కుంభకోణం కేసును విచారిస్తున్న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) అధికారులు, ప్రధానమంత్రి అంతర్గత విజిలెన్స్‌తో కూడిన బాధ్యతల్లో ఉన్న వారు ఈ పథకాలకు ఎంపికైనట్లు పేర్కొంది. వారిలో విశిష్ట సేవకుగానూ ఆరుగురు అధికారులు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని అందుకున్నారు. 24 మందిని మెరిటోరియస్‌ పోలీస్‌ మెడల్‌తో సత్కరించారు. ముంబై ప్రత్యేక విభాగంలో భాగమైన అదనపు ఎస్పీ అలోక్‌ కుమార్‌, డిప్యూటీ ఎస్పీలు అతుల్‌ హజెలా, తేజ్‌ప్రకాష్‌ దేవరాణి, శ్రీధరన్‌, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ గుర్మీత్‌, సింగ్‌, ఎఎస్‌ఐ నర్పత్‌ సింగ్‌ ఉన్నారు. వీరితోపాటు బగ్గు కుంభకోణంపై దర్యాప్తు చేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కేశవ్‌ రామ్‌, అడిషనల్‌ లీగల్‌ అడ్వైజర్‌ విజరు కుమార్‌ శర్మ తదితరులు పతకాలు పొందిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker