Allసినిమాలు

అఖిల్ నిర్ణ‌యం క‌రెక్టా!

టాలీవుడ్‌ లో ఒకప్పుడు అక్కినేని హీరోలు అంటే ఒక బ్రాండ్‌ ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఇతర హీరోల ముందు అక్కినేని ఫ్యాన్స్ ఎందుకో కొంత ఢీలా ప‌డ్డారు. నాగార్జున టైం అయిపోయినా ఇంకా సినిమాలు చేస్తూ అడ‌పా ద‌డ‌పా హిట్లు కొడుతున్నారు. ఇక నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్‌లు అయినా తమ సత్తా చాటి యంగ్‌ స్టార్‌ హీరోలకు పోటీ ఇస్తారనుకుంటే వారు ప్రేక్ష‌కుల‌కు కొంత‌ నిరాశ పర్చుతున్నారు. నాగచైతన్య ఇప్పటికే సెకండ్‌ ర్యాంక్‌ హీరోగా సెటిల్‌ అయ్యారు. అఖిల్‌ అయినా టాప్‌ ర్యాంక్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంటారేమో అనుకున్నారు. కాని అఖిల్‌ కూడా అదే సెకండ్‌ గ్రేడ్‌ హీరోల సెటిల్‌ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

అఖిల్‌ మొదటి సినిమాతోనే స్టార్‌ అవుతార‌ని అంతా భావించారు. మొదటి సినిమాను స్టార్‌ హీరో సినిమా స్థాయిలో నిర్మించడంతో పాటు ప్రమోట్‌ చేశారు. కాని అఖిల్‌ మూవీ అంత‌గా హిట్ కాలేక‌పోయింది. ఆ తర్వాత హలో, తాజాగా మిస్టర్‌ మజ్ను చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద  బోర్లా పడ్డాయి. దాంతో నాల్గవ సినిమా ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే అఖిల్‌ నాల్గవ సినిమా గురించిన ఆసక్తికర వార్తలు మీడియాలో వస్తున్నాయి.

అఖిల్‌ నాల్గవ సినిమా సత్య పినిశెట్టి దర్శకత్వంలో ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు అఖిల్‌ స్టార్‌ డైరెక్టర్‌తో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల, సుకుమార్‌, త్రివిక్రమ్‌ లలో ఒకరితో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు అఖిల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఇప్పటికే పలు సినిమాలు కమిట్‌ అయ్యి ఉన్నారు. ఈయనతో సినిమా చేయాలంటే రెండు మూడు సంవత్సరాలు అయినా పడుతుంది. ఈ సమయంలో అంతటి బ్రేక్‌ తీసుకుంటే అఖిల్‌ కెరీర్‌ మొదటికేమోసం వస్తుందనేది కొందరి వాదన. మరి అఖిల్‌ ఏం చేస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker