
శ్రీకాకుళం జిల్లా పలాసలో 1978 ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతు తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పిస్తున్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ మూవీ విడుదలకు ముందే పరిశ్రమలో చర్చించుకునేలా మారింది. సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ ‘పలాస 1978’ సినిమా నుంచి ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ లాంఛ్ చేసారు..
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ గారు మాట్లాడుతూ: ‘దర్శకుడు కరుణ్ కుమార్ రైటర్ గా రాసుకున్న కథలు కొన్ని చదివాను చాలా బాగుంటాయి. ఆయన వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథను దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో సక్సస్ ‘పలాస 1978’ సినిమా చూస్తున్నప్పుడు కనిపించింది.పల్లెటూరిలో కనిపించే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకునేలా సినిమా ఉంది. కొత్త కుర్రాడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది.ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. ఉత్తరాంధ్ర జానపదాలు చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆ పాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘ పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్ ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచె ను అభినందనలు తెలిపారు.




