
క్రీడల ప్రాధాన్యతలో వెండితెర మీద చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా లు సంయుక్తంగా `బధాయి హో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం `మైదాన్` .
భారత దేశాన్ని ఫుట్ బాల్ కు చెందిన ఒక కోచ్ నిజ జీవిత కథ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నేటి తరానికి స్ఫూర్తిమంతమైన కథగా మలచినట్టు చిత్రయూనిట్ చెపుతోంది. జీవితంలో అయినా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుందిన్న సూత్రం మేళవించి రూపొందిన ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చినట్టు తెలిపింది కోల్ కత్తా, లక్నో, ముంబై నగరాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైదాన్ నవంబర్ 27, 2020న విడుదల చేయనున్నారు.
కాగా ఈ చిత్రానకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. సైవిన్ కాద్రస్, రితేష్ షా లు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తుండగా జాతీయ ఉత్తమనటి ప్రియమణి, `బధాయి హో` ఫేమ్ గజరాజ్ రావు, బెంగాలీ నటుడు రుద్రనిల్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.



