Allవార్తలు

మ‌సీదుల్లోకి మ‌హిళ‌లు రావ‌చ్చు… సుప్రీంలో బోర్డు అఫిడ‌విట్‌

ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని ,  . సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనల్లో  వారు పాల్గొనడం తప్పనిసరి కాదంటూ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు  సుప్రీంకి తెలియ‌జేసింది.మసీదుల్లోకి మహిళలను అనుమతించే విషయమై జోక్యం చేసుకోవాలంటూ యస్మీన్ జుబెర్ అహ్మద్ పీర్జాదీ  సుప్రీంకోర్టులో దాఖలు చేయ‌గా, మసీదుల్లోకి మహిళల ప్రవేశం కోరుతూ ఇద్దరు మహిళలు  దాఖలు చేసిన సదరు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్‌ లా బోర్డును ఆదేశించిన నేప‌థ్యంలో  బుధవారం జనవరి 29, 2020 న ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఇందుకు సంబంధించిన వివరణలు తెలుపుతూ..  సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 
 
సాధార‌ణ ముస్లిం మహిళలు కూడా పురుషుల్లాగే మసీదుల్లోకి ప్రవేశించ వ‌చ్చ‌ని,  అక్క‌డ‌నమాజ్ చేసుకోవచ్చని మత పర‌మైన  సిద్ధాంతాలు ఆచ‌రించ‌డంతో పాటు విశ్వాసాలను అనుసరించడం వారికి సంబంధించిన విష‌య‌మ‌ని,  మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కును వినియోగించుకోవడం వారి ఇష్టమని, ఇందుకు ఎవ‌రి అనుమ‌తులు అవ‌స‌రం లేదంటూ  బోర్డు కార్యదర్శి మహమ్మద్ ఫజ్లుర్రహీం త‌ను దాఖ‌లు చేసిన‌ అఫిడవిట్ లో పేర్కొన్నారు.  ముస్లిం లా బోర్డు సమాధానం ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker