Allఆంధ్రప్రదేశ్
శుక్రవారం కోర్టుకు హాజరు కావడంలే

వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల కోర్టుకు హాజరుపై ఉపసమనం లభించింది. 2012లో వరంగల్ జిల్లా పరకాలలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు కొండా మురళీ, సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. వారికి కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని తెలుస్తోంది.
కోర్టు సమన్లు జారీ అయినా.. అధికారికంగా వారికి ఇంకా అవి చేరలేదు. దీంతో వారెవరూ శుక్రవారం కోర్టుకు హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయాన్ని కొండా సురేఖ మీడియాకు తెలిపారు. తమకు ఎటువంటి సమన్లూ రాలేదన్నారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత తాను వివరాలు అడిగి తెలుసుకున్నానని చెప్పారు. కోర్టుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు



