దేవాలయాల అభివృద్ధికి, నిర్మాణాలకు 25 లక్షల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పటాన్ చేరు నియోజకవర్గంలోని ముందుకు తీసుకెళ్తాం దేవాలయాల అభివృద్ధికి, నిర్మాణాలకు 25 లక్షల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి, వీరన్న గూడెం గ్రామాల పరిధిలోని దుర్గమ్మ, పోచమ్మ దేవాలయాల నిర్మాణాలకు పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 25 లక్షల రూపాయల విరాళం అందించి మొత్తం 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
బొంతపల్లి శ్రీ అయ్యప్ప దేవాలయంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
వీరన్న గూడెంలో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోదారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కులమతాలకు అతీతంగా స్థానిక నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్ , వీరన్న గూడెం సర్పంచ్ మమతా వేణు, బొంతపల్లి సర్పంచ్ నవీన శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి , గుమ్మడిదల సర్పంచ్ నరసింహారెడ్డి ,దోమడుగు సర్పంచ్ రాజశేఖర్, నాయకులు గోవర్ధన్ రెడ్డి ,నరేందర్ రెడ్డి, కుమార్, విష్ణువర్ధన్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు హుస్సేన్, గ్రామస్తులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



