తువ్వేకొద్ది అక్రమాలు……… అడుగడుగునా అగ్రిమెంట్లు
18 ఎకరాల ఎఫ్ పి ఎల్ భూమిని మాయం! ఆన్లైన్లో ఉన్న భూమిని ఆఫ్లైన్లో పెట్టింది ఎవరు? ఆన్లైన్లో ఉన్న భూమిని ఆఫ్లైన్లో పెట్టడానికి ఎవరు కంప్లైంట్ చేశారు, అసలు ఆఫ్లైన్లో ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అనే విషయాలు బయటకు వస్తే దొంగలబండారం బయటపడుతుంది . అయినప్పటికీ ఈ ల్యాండ్ పై ఓనర్లు రిజిస్ట్రేషన్ కాకముందు అడిగిన వారి కల్లా అగ్రిమెంట్లు చేసుకుంటూ భూమి అమ్మడానికి ఎన్నో రకాల ఒత్తిడిలు పై అధికారుల నుండి పొలిటికల్ లీడర్ల వరకు తీసుకొచ్చారు, సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్ కుమారుని కూడా దీనిలో భాగం చేశారని చెప్పుకుంటున్నారు. పటాన్చెరువు మండలం నందిగ్రామ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ కు 165,166,167,168,169,170,171 సంబంధించి 72 ఎకరాల భూమి పీటీలకు సంబంధించింది ఈ భూమిని పీటీలకు దక్కనివ్వకుండా వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా భూమిని కాజేసేందుకు ఓ మాజీ మంత్రి వల ఈ 72 ఎకరాల భూమిరియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువ బ్రోకర్ల ఆధిపత్యం ఉంటుంది. 18 ఎకరాల భూమి ఎఫ్ పి ఎల్ లో ఉంది. మాజీ మంత్రి ఒక్కడే గవర్నమెంట్ కొనేసే అంత డబ్బు సంపాదించడమే టార్గెట్గా పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మధ్యవర్తులుగా మారి చెప్పిన మాట పక్కకు నెట్టి తను సాధించాలనుకున్న టార్గెట్ వైపు బలంగా పోతున్నారు. హైదరాబాదు లో అనేక ఫార్మసీ కంపెనీలు అతని చేతిలో పెట్టుకొని అతను ఎంత చెబితే అంతా అన్న చందంగా ముందుకు పోతున్నారు ఈ మాజీ మంత్రి గారు గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈరోజు వరకు ఎంతోమంది పేదల భూములను అగ్రిమెంట్లు చేసుకుని జిపి చేసుకొని సగం సగం డబ్బులు ఇచ్చి వారిని తన చుట్టూ తన వారి చుట్టూ తిప్పించుకుంటున్నారు దాదాపు పది నుండి పదిహేను యజమానులకు ఆ మాజీ మంత్రి వ్యాపారాలు సాగించేందుకు అడుగులు వేస్తున్నారు గతంలో ఆయన చేసిన పదవిని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం ఆయన లీలల్లో ఈ వార్త చాలా చిన్న ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పై ఇంకా అగ్రిమెంట్లు ఉన్నాయంటూ చాలా మంది పేపర్లు పట్టుకొని బిల్డర్ దగ్గరకు తిరుగుతూనే ఉన్నారు వీరంతా ఈ ల్యాండ్ ఓనర్లకు సంబంధించిన బంధువులే అమ్మేసి కూడా మరలా అమ్ముతామని తిరగడం అనేది చాలా దురదృష్టకరం మరి ఈ విషయం ల్యాండ్ ఓనర్లకు తెలుసా తెలియదా ఈ మొత్తం ల్యాండ్ ను 270 కోట్లకు కొనుగోలు చేసిన సంస్థలు దాదాపు 45 నుంచి 50 మధ్యలో ఉంటాయి.




