ప్రముఖుల వీడియోలు మరో మూడు, నాలుగు వెలుగులోకి వస్తాయి,…. ఎంపీ రాఘురామకృష్ణరాజు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన, శృంగార, రసిక, చిలిపి పార్టీ అని సోషల్ మీడియా వేదికగా
ట్రోల్ చేస్తున్నారని నరసాపురం ఎంపీ రాఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఒకరు పల్నాటి పులి కాగా, మరొకరు విశాఖ వీరుడు,
ఇంకొకరు రాయలసీమ సింహం అన్నారు. విశాఖలో శృంగార పీఠం, పల్నాడులో చిలిపి పీఠం, ఇక రాయలసీమలో
మరొక శృంగార పీఠం ఏర్పాటు చేశారని వాస్తవానికి పార్టీకి పెద్దాయన పేరు పెట్టుకున్నామని, ఎన్నికల
కమిషన్ నుంచి అనుమతి లభించకపోవడంతో యువజన
రైతు శ్రామిక పార్టీగా నామకరణం చేశారన్నారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువకులను,
రైతులను, శ్రామికులను అందర్నీ నిండా ముంచామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో
మాట్లాడారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు జరగదు కానీ మూడు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు
శృంగార పీఠాలు మాత్రం ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఒకరు పల్నాటి పులి కాగా, మరొకరు విశాఖ వీరుడు,
ఇంకొకరు రాయలసీమ సింహం అన్నారు. విశాఖలో శృంగార పీఠం, పల్నాడులో చిలిపి పీఠం, ఇక రాయలసీమలో
మరొక శృంగార పీఠం ఏర్పాటు చేశారని అపహాస్యం చేశారు. వీడియోతో పాటు ఆడియో టేపులపైనా విచారణ జరిపించి
చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటే, పెద్ద పదవుల్లో ఉన్న మరికొందరి పేర్లు
వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో సకల శాఖ మంత్రి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రముఖుల వీడియోలు మరో మూడు, నాలుగు వెలుగులోకి వస్తాయి, రెడీగా ఉండాలని తమ పార్టీ ఎన్నారై విభాగానికి
చెందిన వ్యక్తి చెప్పారని రఘురామ వెల్లడించారు. మాధవ్‌కు నోటీస్ ఇస్తే, పేపర్ ద్వారానే సమాధానం ఇవ్వాలని
కోరాలన్నారు. మాధవ్ అంటే తనకు ద్వేషం లేదని, కేవలం జాలి మాత్రమే ఉందన్నారు




