తెలంగాణముఖ్యాoశాలు

ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం

కొమురంభీమ్ (వాంకిడి ):అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బంబారా గ్రామం లోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పులుల సంరక్షణ మరియు పర్యావరణంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారులు లక్ష్మణ్, అత్తర్ ఉద్దీన్, బీట్ అధికారులు ఇంతియాజ్, యాదవ్ రావు, కామరాజు, సుమన్, ఏ ఎస్ ఐ పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker