
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌ను, హైకోర్టు అనుమతించింది. గవర్నర్,
అసెంబ్లీల సెక్రెటరీలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చింది. తన కోటాలో
ఎమ్మెల్సీగా నియమించే వారిని గవర్నర్ పూర్తి విచక్షణాధికారంతో నియమించలేదని ధనగోపాల్
అనే వ్యక్తి పిటిషన్ దాఖలు అయింది. మంత్రివర్గ తీర్మానంతో ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న
బసవరాజు సారయ్య, దయానంద్‌ను అక్రమంగా నియమించారని పేర్కొన్నారు. తన పేరును
గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తూ రెండుసార్లు గవర్నర్ సిఫారసు చేసినా తనకు రావలసిన అవకాశాన్ని
ఇతరులకు అక్రమంగా కట్టబెట్టారని పిటిషన్‌లో తెలిపారు. తనను ఎమ్మెల్సీగా నియమించేందుకు తగిన
ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ 2020లో ధనగోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇంప్లీడ్గా
స్వీకరిస్తూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను
ఆగస్ట్ 30కి వాయిదా వేసింది.




