
సంజయ్ వర్మ, నవీన్, గరిమా సింగ్‌లు హీరో, హీరోయిన్లుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి పునర్నవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఒక చిన్న విరామం’. చిత్ర సెన్సార్ పూర్తయ్యంది. సందీప్ చేగూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘యు/ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.
మూన్ వాక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని రూపొందిన ఈ సినిమాకు భరత్ మంచి రాజు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించిందని, ఇప్పుడు ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందటం ఆనందంగా ఉందని చిత్ర వర్గాలు చెప్పాయి. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు వివరించారు.




