ఆత్మ విశ్వాసానికి, ఉత్సాహానిక ప్రతీక పోలీస్ బ్యాండ్ 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు భేష్…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ఆత్మ విశ్వాసానికి, ఉత్సాహానిక ప్రతీక పోలీస్ బ్యాండ్
27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు భేష్…
పోలీస్ బ్యాండ్లు అద్భుతమైన ప్రదర్శనలకు నిలువెత్తు నిదర్శనం
ఈ సంగీత స్వరాలు దేశమంతటా ప్రతిధ్వనిస్తూనే ఉండాలి
దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కామెంట్స్
సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో ఘనంగా ముగిసిన 27వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ పోటీలు
దేశవ్యాప్తంగా పాల్గొన్న 21 టీంలు
ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో సీఆర్పీఎఫ్ కు మొదటి స్థానం
తెలంగాణకు 4వ స్థానం
విజేతలకు బహమతి ప్రదానం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ : పోలీస్ బ్యాండ్లు జవాన్ల ఆత్మవిశ్వాసానికి, ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కఠినమైన విధులు నిర్వహించి అలసిపోయిన సమయంలో, బ్రాస్ బ్యాండ్ లేదా పైప్ బ్యాండ్ నుంచి వినిపించే మధురమైన సంగీతం మళ్లీ వారిలో ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పారు. ఈ 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో మారుమోగిన సంగీత స్వరాలు దేశమంతటా ప్రతిధ్వనిస్తూనే ఉండాలని, ఆ సంగీతం మన దేశ ప్రజలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు సందర్భంగా శామీర్ పేటలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ సందీప్ ఖిర్వార్, సదరన్ సెక్టార్ ఐజీ టి విక్రమ్, ఐబీ జాయింట్ డైరెక్టర్ నవ్-దీప్ సింగ్ గ్రెవాల్, సీఆర్పీఎఫ్ డీఐజీ వీరరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్‌లో సంగీతం, క్రమశిక్షణ, సంప్రదాయం, సేవాభావం కలగలిసిన అద్భుతమైన వేడుక 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు. ఈ పోటీల ఘనమైన ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన పోలీసు బృందాల అద్భుతమైన ప్రదర్శనలు కనబర్చాయి. పోలీస్ బ్యాండ్ బృందాల క్రమశిక్షణ, అద్బుత పనితీరును చూసి నా హృదయం ఎంతో గర్వంతో నిండిపోయింది. పోలీస్ బ్యాండ్ పోటీల వెనుక నెలల తరబడి చేసిన కఠినమైన శ్రమ, అంకితభావం, పరస్పర స్నేహభావం, సమిష్టి కృషి కన్పించింది. ఇవన్నీ ఈరోజు ఒక గొప్ప విజయంగా నిలిచాయి.




