Allజాతీయ వార్తలు

స్ట్రేలియా ని వ‌ణికిస్తున్న‌ కార్చిచ్చు

అతి పెద్ద దేశంగా పేరుగావించిన ఆస్ట్రేలియా ఇప్పుడు కార్చిచ్చు కారణంగా దయనీయ పరిస్థితిలోకి జారుకుంది.  ఇప్పటి వరకూ సుమారు 50 కోట్లకుపైగ జీవరాసులు చనిపోగా.. మంటల్లో చిక్కుకొని కాలిపోయిన మూగ జంతువుల ఫొటోలు అందర్నీ కలచి వేస్తున్నాయి. మంటలను ఆర్పడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. మంటల కారణంగా జనం కూడా అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో రెండు నెలలుగా ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుకు ఇప్పటివరకు 26 మంది ఫైర్‌ ఫైటర్‌లు తమ ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నప్పటికీ అనధికారికంగా ఆ సంఖ్య చాలానే ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా కార్చిచ్చును అంతరిక్షం నుంచి చూస్తే ఓ అగ్నిగోళంలా కన్పిస్తోంది. 

మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జానెట్ స్టాన్లీ తెలిపిన వివరాల ప్రకారం… కార్చిచ్చు రగిలించిన వారిలో 12 నుంచి 24 ఏళ్ల 
యువకులు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లున్నారు. చిన్నతనంలో వారు పెరిగిన పరిస్ధితుల ప్రభావం వల్ల బుష్ ఫైర్ చేసి ఉండవచ్చు అని ఆమె అంటున్నారు. ఆస్ట్రేలియాలో 25.5 మిలియన్ ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించివేసిన తర్వాత విక్టోరియా, సౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ లో 700 మిలియన్ డాలర్ల(రూ.3,473 కోట్లు) నష్టం వచ్చినట్లు బీమా సంస్ధలు అంచనావేశాయి.

ఇప్పటికే బుష్ ఫైర్ ను  రగలించారన్న ఆరోపణలతో న్యూ సౌత్ వేల్స్ లో 183 మందిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా చెప్పింది. అలాగే విక్టోరియాలో 43 మంది పై.. పొరుగునున్న క్వీన్స్ లాండ్ లో 101 మందిని అరెస్టు చేశారు. వీరిలో 70 శాతం మంది కుర్రాళ్లే కావడం గమనార్హం. వీళ్ల ఆకతాయి పనులవల్లనే స్థానికంగా కార్చిచ్చు రగులుకుందని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లలో సగం మందికి మంటలను సృష్టించి వాటిని ఆర్పడమంటే చాలా ఇస్తామంట. మంటలు ఎలా వ్యాపిస్తాయో, వాటిని చూటడం, ఆర్పటం వంటి విషయాలపై  వీళ్లకు ఆసక్తి ఉంది. వీళ్లంతా ఫైర్ ఫైటర్స్ కావాలనుకున్నారు. అందుకే వాళ్లే అడవులను తగలబెట్టారన్నది మరో అంశం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker