జాతీయ వార్తలుముఖ్యాoశాలు
ద్రౌపది ముర్ము విజయం తర్వాత తొలి ప్రసంగం

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఇటీవలే సంచలన విజయం సాధించిన
ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ప్రసంగించారు. తనకు
మద్దతిచ్చినందుకు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.
దేశానికి మేలు చేసేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని ముర్ము చెప్పారు.
ఏనాడూ తప్పుడు మార్గంలో వెళ్లబోనని, ప్రజలను నిరాశపరచబోనన్నారు.
తనకు ముందూ వెనుక ఎవ్వరూ లేరని, కుమార్తె ఉన్నా ఆమె ఉద్యోగం
చేసుకుంటున్నారని చెప్పారు. దేశానికి అంకితమై పనిచేస్తానన్నారు.
తనది సాధారణ జీవనమని, తన ఆదివాసి మూలాలతో గర్వంగా అనిపిస్తుందని
ముర్ము చెప్పారు.బహుశా పనితీరు వల్లే తనకు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా,
ప్రస్తుతం రాష్ట్రపతిగా అవకాశాలు వచ్చాయని అనుకుంటున్నానని చెప్పారు.
తనకు ఇచ్చిన అన్ని బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు
. ప్రధాని మోదీ సలహాతో జార్ఖండ్ గవర్నర్‌గా గ్రామగ్రామమూ తిరిగి ప్రజలతో
మమేకమయ్యానని తెలిపారు. గవర్నర్‌గా ఛాన్సలర్ హోదాలో యూనివర్సిటీలు,
కాలేజీలు మాత్రమే కాక విద్యార్ధుల పాఠశాలలు, హాస్టళ్లు కూడా సందర్శించానని
చెప్పారు. విద్యార్ధి దశలో పునాది బాగుంటే భవిష్యత్తు బాగుంటుందని యువతరం తమ
పుట్టి పెరిగిన ఊరుతోనూ, గురువులు, పెద్దలతో అనుబంధం కలిగి ఉండాలని విద్యతో పాటు
కనీస వసతుల అభివృద్ధి కోసం పనిచేశానన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎప్పటికప్పుడు తన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటుంటారని ముర్ము తెలిపారు.
ఎన్నికల కోసం బయోడాటా అడిగారని, తాను సింగిల్ పేజీలో మాత్రమే ఇవ్వగలిగానని చెప్పారు.
మిగతా వారిలా వీడియో క్లిప్ కానీ చేసిన కార్యక్రమాల గురించి ఇతర ఫొటోలు కానీ పెట్టలేకపోయానని
ముర్ము చెప్పారు.




