
ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో అత్యంత భారీ దొంగతనం జరిగింది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి హెణ్ణూరు రోడ్‌లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు.
ఓ పథకం ప్రకారం ఈ ఘరానా దొంగతనం జరిగింది. గోడకు కన్నమేసి లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచిన బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, దొంగతనం జరిగిన తీరును గమనించి, లోపలి పరిస్థితుల గురించి తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో విచారణ ప్రారంభించారు.


