Allసినిమాలు

జనవరి 1న ప్రేక్షకుల ముందుకు డిగ్రీ కాలేజ్

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం తదితర చిత్రాలు అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు దర్శకుడిగా నరసింహ నందికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డిగ్రీ కాలేజ్, తన పంధాకు బిన్నంగా రొమాన్స్ అంశాలను మేళవించి ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. .ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం రెండు ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించడమే కాదు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ఇదిలావుండగా… శుక్రవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో పాటు రెండు ట్రైలర్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేసారు. అతిధిగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్ ఒక ట్రైలర్ ను, ఇంకో ట్రైలర్ ను సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ ఆవిష్కరించగా, మేకింగ్ వీడియోను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బాపిరాజు విడుదల చేసారు. 
ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, నూతన ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలను తీయడం మొదటినుంచి నా అలవాటు. అయితే ఈ చిత్రాన్నిఆర్ట్ జోనర్లో కాకుండా ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా తీసాం. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి క్లాస్ రూంలో, బయట ఎలా ప్రవర్తించారో అన్న అంశాలనే సహజత్వానికి దగ్గరగా ఇందులో చూపించాను. ఇంతవరకు నేను తీసిన చిత్రాలకు బిన్నంగా కమర్షియల్ అంశాలను పొందుపరిచాను. ట్రైలర్లో ఒక రకంగా..సినిమాలో ఒకరకంగా చూపించడం నాకు అలవాటు లేదు. ట్రైలర్స్ లో వున్నది సినిమాలోనూ ఉంటుంది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే సెన్సార్ లో కట్ చేసారు అని అన్నారు. 
అతిధి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సందేశాత్మక అవార్డు చిత్రాలను తీసే దర్శకుడు ఇలాంటి రొమాంటిక్ చిత్రం ఎందుకు తీశారో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం అప్పుడప్పుడైనా ఆయన తన పంధా చిత్రాలను తీస్తుండాలి. ఏదిఏమైనా…యూత్ ను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటుందని బావిస్తున్నా అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో రొమాన్స్ మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగ సన్నివేశాలున్నాయి. హృదయాలను స్రుపించే స్పృశించే సన్నివేశాలున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నా అని చెప్పారు. హీరో వరుణ్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు యువతను చెడిపేస్తున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. రొమాన్స్ అంశాలను సబ్జెక్టు లో భాగంగానే పెట్టడం జరిగింది అని అన్నారు. హీరోయిన్ దివ్యారావు మాట్లాడుతూ, ప్రేమకథ అయినప్పటికీ ఎంతో భావోద్వేగ భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అని అన్నారు. ఈ  కార్యక్రమంలో నటులు రవి రెడ్డి, మదన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker