
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు గత నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నటుడు శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఆదివారం రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ వర్గాలు చెప్పాయి. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.
కృష్ణా జిల్లా మేకావారిపాలెంలో 1948 మార్చి 16వ తేదీన జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. తదుపరి కుమారుడు శ్రీకాంత్ సినిమా హీరోగా వెలుగొందటంతో హైదరాబాద్ వచ్చేసి గత కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు.
తన తండ్రి పరమేశ్వరరావు పార్థీవ దేహానికి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని శ్రీకాంత్ తెలిపారు.




