Allముఖ్యాoశాలువార్తలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10మంది మృతి


మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. అలాగే మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలిసిన వివరాలు ప్రకారం..సిద్ధి నుంచి రేవా వైపుకు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు శరవేగంతో వెళ్లి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది మృతిచెందగా..30 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సమయంతో సహాయ చర్యలను చేపట్టారు. కాగా ‍ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని పూర్తిగా దెబ్బతిన్న బస్సు ముందు భాగాన్ని చూస్తే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker