Allముఖ్యాoశాలువార్తలు
నల్గొండలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..!

నల్గొండలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు (ఏపీ 36 ఎక్స్ 3654) చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై.. బస్సు ఆపి అందులో ఉన్న ప్రయాణికులను దిగమని కేకలు వేశాడు. వెంటనే ప్రయాణికులు బస్సు దిగారు. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. దగ్ధమైన బస్సును గుంటూరుకు చెందిన గాయత్రి ట్రావెల్స్ గుర్తించారు.




