
ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేస్తున్న తాజా మూవీ ‘రెడ్’ తమిళ్ లో అరుణ్ విజయ్ హీరోగా వచ్చిన తడం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన ఈ మధ్యే ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై ప్రేక్షకుల అభిమానం దక్కించుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ అనే పల్లవి తో సాగే ‘రెడ్’ మూవీ ఫస్ట్ సాంగ్ ని నేటి సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనుంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయనంలో నటిస్తున్న ఈ యాక్షన్ థిల్లర్ మూవీలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ చిత్రాన్నిశ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు




