‘భీష్మ’ విడుదల సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుము తో చిట్ చాట్

నితిన్, రష్మిక మందన్నా జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం భీష్మ శుక్రవారం ప్రేక్షకుల ముందు కొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు సంభాషించారు. విడుదల సందర్భంగా
భీష్మ కథ కి ముందుకు మీరు చాలా టెన్షన్ పడ్డారట…?
అవును… నితిన్‌ని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇది.‘ఛలో’ విడుదలయ్యాక ఆతనికి చెప్పా. ఆయన బాగుందని సై అన్నారు. అయితే స్ర్కిప్ట్ పూర్తవడానికి సమయం పడుతుండటంతో కాస్త టెన్షన్ పడిన మాట వాస్తవం. దానిని నితిన్ గమనించి ఏం కంగారు ఏమీ లేదు. నేను వెయిట్ చేస్తా… మనం పూర్తి బౌండెడ్ స్ర్కిప్ట్‌తోనే సెట్‌కి వెళదాం. ’ అని దాదాపు ఏడాదిగా మరో సినిమా చేయకుండా చాలా వెయిట్ చేసారు. మధ్యలో మార్పులు, చేర్పులు లేకుండా రూపొందిన . షూటింగ్ కూడా చాలా సాఫీగా అయిపోయింది.
సినిమా కథ ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ సినిమాకి ఎలా షింక్ అయ్యింది?
భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్ నాగ్‌కి, నితిన్ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే మీకు అర్ధమవుతుంది. నితిన్ అన్ని సినిమాలలాగే ఇందులోనూ లవ్‌స్టోరీ ఉంది. దీన్ని వినోదాత్మకంగా మార్చేసాం. అయితే కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను. సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నదే ఆసక్తికర పాయింట్. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశం కూడా ఈ సినిమా లో ఉంది
రష్మిక ని మరోమారు ఎంపిక చేసారేంటి సంగతి?
డెడికేషన్‌తో పని చేసే నటి రష్మిక. ఆమె నటన నాకు చాలా ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. ఆమె తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. అందుఏ రెండో సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయింది. స్టార్‌గా మళ్లీ నేనడిగితే చేస్తుందో లేదో అనుకున్నా. కానీ ఇలా కథ టూకీగా చెప్పి అడగ్గానే అంగీకరించింది. నితిన్‌తో ఆమె సినిమాలో చేసిన సందడి అలరిస్తుంది.
మరి అనంతనాగ్ గారిని ఎలా ఒప్పించారు?
ఈ సినిమాలో హుందాగా ఉండే ఓ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నా, అనంత నాగ్ గారైతే బాగుంటుందని, కొత్తగా ఉంటుందనిపించింది. ఆయన్ని సంప్రదించాను . ముందు ససేమిరా చేయనన్నారు. అయితే మొత్తం కథని వినిపించా. సినిమాకు ఆ పాత్ర ఎంత కీలకమో చెప్పి ఒప్పించగలిగాను.
రచయితగా త్రివిక్రమ్‌ని ఫాలో అవుతున్నట్టుంది… ఆ పంచ్ డైలాగులు బాగా కనిపిస్తున్నాయి. ఏమంటారు?
అవును ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యుత్తమ రైటర్స్‌లో త్రివిక్రమ్ చాలా ముందుంటారు. నిజానికి నేను ఆయనకు అభిమానిని. గతంలో నేను ఆయన దగ్గర పని చేయడం వల్లనో ఏమో, ఆతని ప్రభావం నామీద ఉండటంలో ఆశ్చర్యం లేదు. అందుకే నేను రాసే డైలాగులు ఆయన డైలాగుల్లా ఉంటాయనిపిస్తాయి. త్రివిక్రమ్‌గారు కూడా ఈ సినిమా చూసి బాగుందన్నారు. ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి సినిమాకి రావాలంటే ట్రైలర్లోనే కథ చెప్పేయాలని ఎలాంటి కన్ఫ్యూజన్ చేయకూడదని ఆయన ఇచ్చిన సలహానే ట్రైలర్లో కథ చెప్పే ప్రయత్నం చేశా. అది ఫలించింది. ప్రేక్షకులలో ఈ సినిమా పై అంచనాలు పెంచింది.
సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు?
అవును నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఏదో తెలియని పిచ్చి. అందుకే సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయిపోయా. అమ్మానాన్నల కోసమనే చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం కూడా చేశాను. నాన్నని ఒప్పించి సినిమాల్లోకి వచ్చా.
తొలి సినిమా విజయం తదుపరి ఛాన్సులు చాలా వచ్చినట్టు ఉన్నాయి?
తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్ చేయడం కామన్. నాకది ఓ గుర్తింపులా అనిపించింది.. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్‌ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
భీష్మ తరువాత చేయబోతున్న సినిమా ఏంటి?
‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.


