తెలంగాణ
వినాయక నిమర్జనాలను పరిశీలించిన ఎస్పీ

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట పై శనివారం రాత్రి వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎస్ పి రమణ్ కుమార్ పరిశీలించారు. వినాయక విగ్రహాలను శాంతి గా నిమర్జనం చేయాలని నిర్వాహకులకు సూచించారు. పోలీసు బందోబస్తును అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు.



