Allముఖ్యాoశాలు

అన్యాయాన్ని ‘ప్రశ్నిస్తా’

నటుడు, దర్శకనిర్మాత పి.సత్యా రెడ్డి తన తనయుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ .. రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ప్రశ్నిస్తా. ఈ చిత్రం లోగో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సి.కళ్యాణ్, టి.ప్రసన్నకుమార్, దాసరి కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అభిషేక్ అగర్వాల్, హీరో మనీష్ బాబు, హీరోయిన్స్ అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా, దర్శకుడు రాజా వన్నెం రెడ్డి, మాటల రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి, సతీష్ రెడ్డి, శేషు బాబు, శివ కుమార్ పాల్గొనగా నిర్మాత సత్యారెడ్డి బొకేలతో అతిధుల్ని స్వాగతించారు.. అనంతరం…నిర్మాత పి.సత్యారెడ్డి మాట్లాడుతూ… ఆరోజు కళ్యాణ్ గారు అన్న మాట నిజం అయ్యింది. రాజా వన్నెం రెడ్డి మా అబ్బాయిని హీరోగా చేస్తానని ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి టైమ్’ లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట మీద నిలబడి మంచి కథతో అద్భుతమైన సినిమా చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలు, ప్రభుత్వ పాలసీలు మీద ఒక స్టూడెంట్ లీడర్ ఏ విధంగా పోరాడారు.. ఎలా ప్రశ్నించాడు అనేది కథ. మా అబ్బాయిని, ఈ సినిమాని అందరూ ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో గ్రాస్పింగ్ పవర్ ఉన్న హీరోల్లో కృష్ణ గారి పేరు చెప్తారు. అలా ఈ చిత్రం లో పెద్ద పెద్ద డైలాగ్స్ మనీష్ చెప్పాడు. ఒక కసితో ఎక్స్ ట్రార్డినరీగా నటించాడు మనీష్. అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది. సత్యారెడ్డి క్వాలిటీకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. డెఫినెట్ గా మనీష్ మంచి హీరో అవుతాడు.. అన్నారు. హీరో మనీష్ బాబు మాట్లాడుతూ.. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది అన్నారు. అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker