
ఒకే ఒక్క సినిమా సావిత్రి క్యారెక్టర్ మహానటి సినిమాలో నటించి అందరి మనసులు దోచుకుంది కీర్తి సురేష్. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడే సమయంలో కీర్తికి మర్చిపోలేని విజయాన్నిచ్చింది మహానటి. ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.
కీర్తి సురేష్ గురించి వదంతులు సృష్టించే వారి సంఖ్య తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువయింది. దీంతో కీర్తి మొదట్లో బాధపడినా ఆ తరువాత మాత్రం గట్టిగా నిలబడింది. నన్ను విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారో నన్ను పొగిడేవారు కూడా అలాగే ఉంటారు. కాబట్టి నేను విమర్శకులను పట్టించుకోను అంటోంది కీర్తి.
ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తనపై జరుగుతున్న దుష్‌ప్రచారానికి స్నేహితులు కూడా స్పందించవద్దంటోంది. తనను ఎవరైతే విమర్సిస్తారో వారితోనే స్నేహం చేస్తానంటోంది కీర్తి సురేష్.




