Allసినిమాలు

వచ్చే నెల‌లో వంశీ పైడిప‌ల్లి తో చిత్రం

ఈ సంక్రాంతికి మొగుడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. `సరిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రిన్స్. ప్రస్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు తన కుటుంబంతో టైమ్ గడుపుతున్నాడు. నెక్ట్స్ మూవీ కోసం కూడా సూపర్ స్టార్ సన్నద్ధమవుతున్నాడు. మహేష్ తర్వాతి సినిమాకు ‘మహర్షి’ సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు తీయనున్నారు. వచ్చే నెల‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 

అయితే,..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ప‌లు ఆస‌క్తిక‌ర‌ ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. `ఒకవేళ మీ బయోపిక్ తెరకెక్కితే.. మీ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది?` అన్న ప్రశ్నకు.. మహేష్ బాబు రెస్పాన్స్.. `నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా బయోపిక్ వర్కవుట్ అవద`ని మహేష్ బాబు జవాబు ఇచ్చాడు. అలాగే `ఒకవేళ మీరు లాంగ్ రోడ్ ట్రిప్‌కు వెళితే మీతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎవర్ని తీసుకెళ్తారు?` అని యాంకర్ ప్రశ్నించారు. దానికి స్పందించిన సూపర్ స్టార్ మహేష్ `రామ్‎చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌.. అలాగే బ్యాలెన్స్‌ చేయడానికి మెగాస్టార్ చిరంజీవిగారిని తీసుకెళ్తాను` అని సమాధానమిచ్చాడు. అలాగే `మీరు ఒక‌రోజు సీఎం అయితే ఏం చేస్తారు?` అనే ప్ర‌శ్న‌కు స్పందించారు మహేష్.. `నేను సీఎం అయితే రాష్ట్రాన్ని ఇక ఆ దేవుడే కాపాడాల`ని మహేష్ చెప్పాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker