తెలంగాణమూవీ రివ్యూ
క్షుద్రపూజ చేయాలని మాంత్రికుడు చెప్పిన దారుణానికి…… కట్టుకున్న భార్యను నగ్నంగా నిలబెట్టి స్నానం
ప్రపంచం సాంకేతికంగా పరుగులు తీస్తున్నా ... ఇంకా మూఢనమ్మకాలతో అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం విచారకరం. కళ్ల ముందు ఘోరం జరుగుతున్నా అడ్డుకోకుండా చోద్యం చూస్తోంది చుట్టూ ఉన్న సమాజం. సభ్య సమాజం తలదించుకునే ఘోర ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. డబ్బుపై ఆశతో మాంత్రికుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడో భర్త. వ్యాపారంలో లాభాలు రావాలన్నా, ఇంట సుఖశాంతులు నెలకొనాలన్నా.. క్షుద్రపూజ చేయాలని మాంత్రికుడు చెప్పిన దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను అంతా చూస్తుండగా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. ఇందుకు అతని తల్లిదండ్రులు కూడా సహకరించారు. చివరికి అత్తామామలు, భర్త ఒత్తిడికి బాధితురాలు తలొగ్గి భర్త చెప్పినట్లే చేసింది. ఇంత దారుణాన్ని చుట్టూ ఉన్నవారంతా చూస్తుండిపోయారే తప్ప అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని, అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాంత్రికుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



