ఒక్కరి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం అవసరమా

ధరణి పేరిట… అంతా మాయ….. తెలంగాణ రెవెన్యూ శాఖ మొత్తం మై హోమ్ రాజేశ్వరరావు చేతుల్లోనే ! ఎవరికి అర్థం కాకూడదు, ఎవర్ని పైకి రానివ్వకూడదు, ఎవ్వరు వ్యాపారాలు చేయకూడదు, ఇదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పేరిట కొన్ని సంస్కరణలు తెచ్చి ప్రజల యొక్క భూములను ప్రభుత్వం పేరు మీదకి రప్పించుకొని వారు అమ్మకుండా, ఎవరు కొనకుండా చేసి, ఒక్క మై హోమ్ రాజేశ్వరరావు మాత్రమే భూములు రెవెన్యూ దగ్గర్నుంచి తీసుకొని వ్యాపారం చేసుకోవాలి అనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ లో ఎక్కడైనా ఏ జిల్లా అయినా ఏ మండల అయినా నేరుగా మై హోమ్ రాజేశ్వరరావుకు సంబంధించిన ఉద్యోగులు తాసిల్దారును ఆర్డీవోను జాయింట్ కలెక్టర్ ను కలెక్టర్ ను సైతం నిలబెట్టి పని చేయించుకోవడంలో ఆరితేరి ఉన్నారనడం లో ఇటువంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయకూడదు, ఒక్క వ్యక్తి తప్ప ఆ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ప్రధాన అనుచరుడుగా ఉండాలి, అతడే మై హోమ్ రాజేశ్వరరావు . అతని కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరును ఇబ్బందులు పాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులు పేర్లు తప్పులు పడ్డ, సర్వే నెంబర్లు తప్పులు పడ్డ ,భూమి తక్కువ పడిన, ఎటువంటి మార్పులు చేసేది లేదు ఎవరు మాట్లాడేది లేదు. అనే విధంగా వారి పరిపాలన కొనసాగుతుంది. తెలంగాణ రాకముందు తాసిల్దార్ కార్యాలయం భూమిపై ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే కలెక్టర్ అనుమతిస్తారు కానీ ఇప్పుడు ధరణి అనే ఒక యాప్ను తయారుచేసి దానిలో రెవిన్యూ రికార్డులు పొందుపరిచి ప్రభుత్వం జీవో ద్వారా మార్గదర్శకాలు ఇస్తే తప్ప రికార్డులు మార్చే ప్రసక్తి లేదు అనేది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. తెలంగాణ రాష్ట్రం అక్రమ వ్యాపారులకు దౌర్జన్యాలకు రాజకీయ నాయకుల ఆగడాలకు ఆలవాలమైంది , ఇలా కొనసాగుతుంటే ప్రజలు ఎవరిని అడుగుతారు, ఎవరి దగ్గరికి పోతారు, నిద్ర లెగిస్తే తాసిల్దార్ లేదా పోలీస్ తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ రెండిటిని కెసిఆర్ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను కీలుబొమ్మలాడిస్తున్నారు. ఒక్కరి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం అవసరమా, అని ప్రజలు అడుగుతున్న ఉలుకు పలుకు లేని పరిస్థితి. హైదరాబాద్ నడిబొడ్డులో పార్కులు కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కట్టి వ్యాపారాలు చేస్తున్న బిల్డర్లు రాజకీయ నాయకులు అందర్నీ గుప్పెట్లో పెట్టుకొని తప్పులు బయటకు రాకుండా ధరణి ఎవరు కదిలించకుండా తెలంగాణ ప్రజల జీవితాలతో ఆట్లాడడం అవసరమా.




