Allముఖ్యాoశాలువార్తలు

కేటీఆర్‌ను ఆ మార్గం నుంచి ఎందుకు అనుమతించారు ..?

హైదరాబాద్: నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో మంత్రి హరీశ్‌రావుకు అవమానం జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు.. మరో మంత్రి హరీశ్‌రావును పట్టించుకోలేదని, ఆయనకు సరైన గౌరవాన్ని ఇవ్వలేదని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై హరీశ్‌రావు స్పందించారు. తనకు ఎటువంటి అవమానమూ జరగలేదని ఖండించారు. తాను వస్తున్నట్టు అక్కడి అధికారులకు ముందస్తు సమాచారం లేదని, అందువల్ల కొంత ఇబ్బంది కలిగిందే తప్ప, తనకు దర్శనం బాగా జరిగిందని వివరణ ఇచ్చారు. 
కాగా వీఐపీలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి అనుమతించిన టీటీడీ, కేటీఆర్‌ను పుష్కరిణి వైపు నుంచి బయో మెట్రిక్ నమోదు కేంద్రం మీదుగా ఆలయంలోకి పంపించారు. కేటీఆర్‌ను ఆ మార్గం నుంచి ఎందుకు అనుమతించారన్న విషయంలో అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker