జాతీయ వార్తలుముఖ్యాoశాలు
ప్రత్యేక విమానం లో ఢిల్లీ కి కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. రెండు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో బస చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. సీఎం కేసీఆర్ వెంట కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెనట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. యశ్వంత్ కు ఓటు ఎందుకు వేయాల్సి వచ్చింది ఆయన ప్రత్యేకంగా కలిసి 15వ రాష్ట్రపతికి వివరించనున్నారు ఆయన ద్రౌపది ముర్మును కలవడం ఆసక్తిగా మారింది.




