స్థలం లేకుండానే ఫ్రీ లాంచ్ చేసిన సాహితీ గ్రూప్

సాహితీ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ యజమాని ఎవరు?
ఆరవ తేదీ………… ఏమీ జరగదు .
అసలు వాళ్ళు ముందుకు రారు ?
పోలీసులు ఉత్సాహం …. దేనికోసం
సాహితీ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ యజమాని ఎవరు?
సాహితీ ఇన్ఫ్రా పేరుతో దాదాపు 1500 మందికి టోపీ పెట్టిన సమస్త యజమాని ఎవరు?
ఎక్కడుంటారు? ఎవరైనా చూశారా? ఇంత జరుగుతున్న ఆ వ్యక్తి బయటికి రాడు,
మీడియాతో మాట్లాడడానికి ఒకరు పోలీసులతో మాట్లాడడానికి ఇంకొకరు రాజకీయ నాయకులతో
మాట్లాడడానికి మరొకరు మొత్తం ఆ కంపెనీలో ఉన్న మెంబర్లు మినహా బయట వారిని కూర్చోబెట్టి
మాట్లాడిస్తున్నారు. ఆరో తేదీ వరకు టైం ఇస్తే బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన ఆ సంస్థ
యజమాని ఎట్లుంటాడు, 1500 మంది డబ్బులు చెల్లించి మూడు సంవత్సరాలుగా ఇంటి కోసం
ఎదురుచూస్తున్న వారికి ఎవరికైనా ఆ సంస్థ యజమాని కనిపించాడా…. ఆయన కనిపించరు కేవలం
నడిపిస్తాడు , ఇలా నడిపించే వ్యక్తులు వ్యాపారం పెట్టేముందు ఎన్ని డబ్బులు పెట్టారు వారికి ఎన్ని
ఆస్తులు ఉన్నాయి మనం పెట్టే డబ్బులు వస్తాయా రావా అసలు స్థలం ఉందా లేదా కడతారా కట్టరా
అని 100 క్వశ్చన్ లు వస్తాయి కానీ ఇప్పుడు మోసపోయిన 1500 మందిలో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు,
రిటైర్మెంట్ ఉద్యోగులు పల్లెటూరు నుంచి పట్నం వచ్చి వీరి చేతిలో చిక్కిన మరికొంతమంది వీరందరికీ
ఒక్కసారైనా ఆ కంపెనీలో ఉన్న దాదాపు ఏడుగురు డైరెక్టర్లు వారిలో ఒక్కరైనా ఎదురుపడ్డారా ఇవన్నీ
తెలుసుకోకుండా ఆలోచించకుండా డబ్బులు కట్టేసి ఇల్లు రాలేదేమి అని ప్రశ్నిస్తే ఎలా.కంపెనీలు పొరపాటు
చేస్తే వారి బ్యాంకులను వారి ఆన్లైన్ సేవలను వారి కంప్యూటర్లను వారు ఆఫీసును పోలీసులు వారి
ఆధీనంలోకి తెచ్చుకుంటారు కానీ ఈ ఆఫీసును మాత్రం ఉద్యోగులందరూ యధావిధిగా పనిచేస్తున్నారు
వచ్చేవారు పోయేవారితో సందడిగానే ఉంది. మరి పోలీసు వారు ఎందుకు ఊరకనే వారిని అలా వదిలేసారు ఆరవ తేదీ పోలీసులకు
రియల్ ఎస్టేట్ వారు టైం ఇచ్చారు. ఆ టైం రోజున ఏం జరుగుతుంది ఏమీ జరగదు మరి కొంచెం టైం కావాలని
లేదంటే ఇంకొకరిని అడుగుతున్నామని కొంత ప్రయత్నం చేస్తామని చెప్పడం తప్ప వారం రోజులు పైనే టైం
ఇస్తే తప్పు చేసిన వాడిని పోలీసులు ప్రశ్నించకుండా బాధితులకు దొరకనివ్వకుండా వారికి న్యాయం జరగకుండా
అడ్డుపడి వారం రోజులు తర్వాత వారికి వారికి మధ్యలో పంచాయతీ చేస్తామని చెప్పడం ఎంత పొరపాటు సాహితి
ఇన్ఫ్రా లో ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు ఆ ఏడుగురు డైరెక్టర్లు మరో 15 కంపెనీలకు డైరెక్టర్షిప్ లో ఉన్నారు ఒక కంపెనీ
నుంచి లాస్ అయితే మరో కంపెనీలో చూసుకుంటారు ఇది వారి నీతి కానీ 40 లక్షల పోగొట్టుకున్న సగటు మనిషి ఎప్పుడు
కోల్కుంటాడు ఇది పోలీసు వారు ఆలోచించాల్సిన విషయం. తప్పు చేశారని పోలీస్ స్టేషన్ పిలిచి వారిని దండించి కేసు
పెట్టి హంగామా చేస్తారు కానీ 1500 మందిని స్థలం లేకుండానే స్థలం ఉన్నట్టుగా నమ్మించి వారి దగ్గర నుంచి డబ్బులు
ఉంచి ఇప్పుడు ముఖం చాటేస్తే మరి వారి పరిస్థితి ఏమిటి? మీడియాకు సమాధానం చెప్పరు, పోలీసులు మాత్రం బాధితులకు
నచ్చజెప్పి పంపిస్తారు మరి పోలీసులు భరోసా ఇస్తారా వారం రోజులు టైం లో ఎంత మంది డైరెక్టర్లు రాజీనామా చేసి
ఉండొచ్చు ఎంతమంది దేశం విడిచిపోవచ్చు ఇవన్నీ ఎవరైనా ఆలోచించారా సాహితీ ఇన్ఫ్రా లో జరిగిన తప్పిదాలు మరొకరికి
జరగకుండా ఉండాలంటే పోలీసులు కఠినంగా వ్యవహరించాలి తప్ప చూసిచూన్నట్టు వదిలేస్తే బాధితుల పరిస్థితి ఏమిటి?
ఆరో తారీకు వారికి న్యాయం జరగకపోతే మీరు న్యాయం చేస్తారా.



