మైత్రివనం ప్రైవేట్ వ్యక్తుల దందా అడ్డ…..

*శుభ్రత, పరిశుభ్రత మచ్చుకైనా కానరాదు
* ఇక్కడ లెక్కలు అడిగే వారు లేరు…. చెప్పేవారు లేరు!
హైదరాబాద్ నడిబొడ్డున అందరి నోట పలికే మాట కలిసే స్థలం అందరికీ వ్యాపారాలకు అడ్డ
‘ఈ మైత్రివనం’, హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది మైత్రివనం కాకుండా మైత్రి విహార్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ఈ మూడు కాంప్లెక్స్లు ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలకు అడ్డాగా మారుతుంది. నెలసరి అద్దెలు తీసుకొని ఈ మూడు బిల్డింగ్ లో షట్టర్లు అద్దెకిచ్చి వ్యాపారానికి అనుకూలంగా ఉండే విధంగా కింద కార్ పార్కింగ్ పెట్టి ఎంతోమంది ప్రజలు వ్యాపారాలు చేసుకునేందుకు ఇక్కడి వాతావరణం బాగా సరిపోతుంది. హైదరాబాదుకు కొత్తగా వచ్చిన మెట్రో రైల్ అటు సికింద్రబాద్ నుండి రాయదుర్గం, ఎల్ బి నగర్ నుండి మియాపూర్ ప్రాంతాలకు కలుపుతూ అమీర్ పేట్ మీదుగా వెళ్ళే విధంగా ఏర్పాటయింది. ఎటు నుంచి ఎటు వెళ్లిన ఇక్కడికి రావడానికి మెట్రో రైల్లో 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. మై త్రీ వనం, మైత్రి విహార్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో అద్దెలు వసూలు చేసుకుని ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ మూడు కాంప్లెక్స్ లో గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు కానీ వారు పూర్తిస్థాయి ఉద్యోగం చేయరు వారికి వచ్చే జీతంలో 30 శాతం జీతం ఇచ్చి ఇంకొక వ్యక్తిని పెట్టుకుని నడిపిస్తుంటారు. అద్దెవసూలు చేసి కొంతమంది ఇవ్వకుండా వెళ్లిపోయారని మరి కొంతమంది తక్కువ ఇచ్చారని ప్రభుత్వానికి ఈ అధికారులు కన్నం వేస్తుంటారు. ఈ మూడు కాంప్లెక్స్ లో శుభ్రత పరిశుభ్రత మచ్చుకైనా కానరాదు. కాంప్లెక్స్ లో ఎటువంటి గొడవలు జరిగినా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం ఇలాంటివి ఆపడానికి సెక్యూరిటీ సిబ్బంది తగినంత మోతాదులో లేరు బిల్డింగ్లో ఎక్కువ ఫ్లోర్లు ఉంటే ఆ ఫ్లోర్లో ఏం జరుగుతుందో చూడడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది ముందుకు రారు కేవలం సెక్యూరిటీ కిందవరకే ఇస్తామని ఆ తర్వాత ఇవ్వబోమని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు ఈ కాంప్లెక్స్ లో ఉండే వ్యాపారులు తమకు తామే ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష కార్యదర్శులను ఏర్పాటు చేసుకొని వచ్చిన దాన్ని వచ్చినట్టుగా వాళ్ళు తినడం మొదలుపెట్టారు ఎంత వచ్చింది ఎంత ప్రభుత్వానికి చెల్లించాలి అనే విషయాలు ఎక్కడ బయటకు రావు శుభ్రత ఉండదు. దాదాపు ఒక రోజులో 10 నుండి 20,000 మంది ఈ కాంప్లెక్స్ లకు వచ్చి పోతుంటారు కాంప్లెక్స్లు మాత్రం శుభ్రత శూన్యం అక్కడకు పోయిన వారందరూ గమనించవచ్చు ఈ విధంగా జీతాల కోసం కనీసం డ్యూటీకి కూడా రాకుండా వేరే బయట వ్యక్తిని కొంచెం డబ్బులు ఇచ్చి వారి ప్లేస్ లో పెట్టి మిగిలినవి వారు మింగేస్తుంటారు ఎవరైనా వివరాల అడిగితే నేను కాదు పైన వారిని అడగమంటారు అలా ఈ మూడు కాంప్లెక్స్ ల పనితీరు మరీ అధ్వానంగా ఉంది. మైత్రి విహార్లు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో ఆకతాయిలు ఎక్కువగా ఉండడం వారిని కంట్రోల్ చేయడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడం వల్ల చాలావరకు బిల్డింగ్ పనికిరాకుండా పోయే స్థితిలో ఉంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన దృష్టి సారిస్తారు అని ఆశిద్దాం.




