తెలంగాణముఖ్యాoశాలు
జిహెచ్ఎంసి అవినీతి బయటకు రాకుండా ఆపుతున్న అధికారులు

*గత మేయర్ హయాంలో జరిగిన ఆక్రమణలు
*జిహెచ్ఎంసి అవినీతి బయటకు రాకుండా ఆపుతున్న అధికారులు
* అవినీతికి అడ్డగా మారిన జిహెచ్ఎంసి నగరపాలక సంస్థ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న అవినీతిని ఒక్కరు కూడా తప్పు అని చెప్పలేని పరిస్థితి అధికారులు మాకు మాటలు లేవు కేవలం ఫైళ్ళ మీద సంతకాలు మాత్రమే పెడతాం. అన్ని మాటలు మేయర్ మాట్లాడుతారు అంటూ జిహెచ్ఎంసి అధికారులు తప్పించుకుంటున్నారు జిహెచ్ఎంసి లో ఉన్న పార్కులువాటికి అనుసంధానంగా ఉన్న లైబ్రరీలు, చిన్నపిల్లల ఆట స్థలాలు ఎక్కడికి పోయాయి వీటితో పాటు వ్యాయామానికి సంబంధించిన పరికరాలు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం ఆ శాఖ డైరెక్టర్ గాని ఇతర అధికారులు కానీ చెప్పడానికి వీలులేదని నగరపాలక సంస్థ మేయర్ హుకుం జారీ చేశారు.
హైదరాబాదులో ఇల్లు నిర్మించుకుంటే పర్మిషన్లు ఉండవు అడిగితే కార్పొరేటర్ కి చెప్పాము అంటారు. హైదరాబాదులో వాన పడితే వీధుల వెంట నీళ్లు ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి ఆక్రమణదారులు అలుగులు కూడా వదలటం లేదు. పార్కులు వదలటం లేదు లైబ్రరీలు వదలటం లేదు ఆఖరికి ప్రభుత్వ భూమి సైతం వదలడం లేదు స్మశానాలు సైతం వదలడం లేదు ఇలా దొరికిన కాడికి దొరికినట్టుగా అడ్డంగా దోచేస్తున్నారు అడగటానికి వచ్చిన వారికి నగర మేయర్ గాని వారి పీఏ గాని నగర కమిషనర్ లేదా వారి పిఏ గాని మాట్లాడతారు తప్ప వేరే వారు ఏ విషయాలు కూడా మీడియా వారితో కానీ ప్రతిపక్షాలతో కానీ ఇటువంటి చర్చలు చేయొద్దని తేల్చి చెప్పారు ఇలా సమాచారం బయటకు రాకుండా అందిన కాడికి దోచేసుకుంటూ పంచుకుంటూ ముందుకు నడుస్తున్నారు జిహెచ్ఎంసి గత మేయర్ హయాంలో అప్పటి కమిషనర్ లెక్కలు వేసి లైబ్రరీలు ఎన్ని ఉన్నాయి పార్కులు ఎన్ని ఉన్నాయి అని స్పష్టంగా మీడియాకు ఇచ్చారు ఆ సమాచారం బయట పెట్టండి అని ఎవరైనా అడిగితే వాటికి సమాధానం ఉండదు. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యం.
టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో కొత్తగా కట్టిన నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో కట్టారని పర్మిషన్లు లేవని కూల్చివేశారు అప్పటినుంచి ఇప్పటివరకు అక్రమ నిర్మాణాలు జరగలేదా ఎక్కడైనా ఇంటి నిర్మాణాలు జరుగుతుంటే ఆపిన దాఖలాలు ఉన్నాయా, కట్టిన నిర్మాణాన్ని పడగొట్టిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడా లేవని చెప్పాలి ప్రభుత్వం కార్పోరేటర్లు ఉన్నతాధికారులు మాజీలు తాజాలు ఎవరు చూసినా తమ జేబులు నింపుకోవడానికి తప్ప నీరు సరిగ్గా పోవడానికి దారి ఎవరైనా చూపించారా ఆక్రమణలు ఎవరైనా ఆపారా జవాబు చెప్పడం చేతగాక అధికారులు నోరుమూయిస్తూ పరిపాలన సాగిస్తున్న జిహెచ్ఎంసి మేయర్ కళ్ళు ఎప్పుడు తెలుసుకుంటాయో




