గల్ఫ్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు……దోమకొండ గంగాధర్

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామంలో గల్ఫ్ కార్మికుడు తాటి కొండ వెంకటరమణ కు రెండు కిడ్నీ లు చెడిపోయి వారానికి మూడు సార్లు మంచిర్యాల హాస్పిటల్ కు వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్నారు గత రెండు సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న బాదంపల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు తలా కొన్ని డబ్బులు జమ చేసి మొత్తం 18300 రూపాయలు ఆర్థిక సహాయము అంద చేసినారు. ఈ సందర్భంగా గల్ఫ్ ఆసోసియేషన్ అధ్యక్షులు దోమకొండ గంగాధర్ మాట్లాడుతూ
అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 2014లో అయితే ఏ వాగ్దానం చేశారో ఇప్పటివరకు నెరవేరు లేదు గల్ఫ్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు 500 కోట్లతో బడ్జెట్ ప్రకటించి గల్ఫ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలనికోరుకుంటున్నాము. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదంపల్లి గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి సభ్యులు పాల్గొన్నారు.




