అప్పటి లెక్కలు ఇప్పుడు తేలుతాయా…. సార్ ?

* చేసింది కొంచెం…. తీసుకుంది భారీ మొత్తం అప్పటి కలెక్టర్ చేతివాటం
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లెక్కలు అప్పజెప్పాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆసుపత్రి వర్గాలకు హూక్కుమ్ జారీ చేశారు. అయితే ఇది జరిగే పనే నా జరుగుతుందా అనేది కష్టమే అయితే గతంలో కలెక్టర్ గా పని చేసిన స్మిత సబర్వాల్ 2014 సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే ఆమె జిల్లాలో పరిపాలన చేశారు ఈ పరిపాలనలో భాగంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ముందు గేటు పెట్టి శుభ్రం చేసినందుకు గాను సదరు కాంట్రాక్టర్కు రెండు కోట్ల రూపాయల వరకు ముట్ట చెప్పినట్టు తెలిసింది ఆసుపత్రికి గేటు పెట్టి శుభ్రం చేస్తే రెండు కోట్లు అవుతాయా అని అప్పట్లో అధికారులు కూడా ముక్కు మీద వేలు వేసుకున్నారు మరి దీని బడ్జెట్ రూపకల్పన ఎవరు చేశారు ఎలా జరిగింది? ఎవరు ఎంత తిన్నారు అనేది పక్కన పెడితే పోయినవి ప్రజల సొమ్మే కాబట్టి ఎవరు పట్టించుకోలేదు సంగారెడ్డి జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన డాక్టర్ శరత్ ఆసుపత్రి తనిఖీ చేసి లెక్కలు అన్ని ప్రిపేర్ చేయమని హుకుం జారీ చేశారు. గతంలో ఏ కలెక్టర్ కూడా ఆసుపత్రి తనిఖీ చేసి లెక్కలు చూపించమని కానీ రిపేర్లు గురించి గానీ పట్టించుకోలేదు స్మితా సబర్వాల్ తర్వాత రాహుల్ బొజ్జ కలెక్టర్ గా, రోనాల్డ్ రోస్, ఆ తర్వాత కన్నన్ వచ్చారు, వాసం వెంకటేశ్వర్లు వచ్చారు తర్వాత హనుమంతరావు గారు వచ్చారు ఇంతమంది కలెక్టర్ మారినా ఎవరు కూడా ఆసుపత్రిలో ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు. డి ఎం హెచ్ ఓ ఆఫీసులో ఏం జరుగుతుంది . ఈ విషయాలు ఏ అధికారులు తమ దృష్టిలోకి కూడా తీసుకోలేదు ఇప్పుడు లెక్కలు కావాలంటే పాపం పోగేసుకున్న వన్నీ ఎక్కడి నుంచి తేవాలి.




