నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్ అరెస్టు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ నైజీరియన్‌ను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు.
అతని నుంచి 30 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్, కెమెన్
ఐల్యాండ్ దేశాలకు చెందిన కరెన్సీని కూడా సీజ్ చేశారు. పట్టుబడ్డ నైజీరియన్ దేశంలో
అక్రమంగా ఉంటున్నాడు. గోవాలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడి, గతంలో జైలుకు వెళ్లొచ్చాడు..
జైలు నుంచి వచ్చిన ఆ నైజీరియన్ పేరు మార్చుకొని మళ్లీ డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులు
పేర్కొన్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
జేమ్స్ జాబితాలో 108 మంది వినియోగదారులు ఉన్నట్లు తేలిందన్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. కింగ్‌కోఠిలో ఇవాళ డ్రగ్స్ సరఫరాకు వచ్చిన జేమ్స్‌ను పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు.




