కలెక్టర్ ఆఫీస్ కు తాసిల్దార్ ఆఫీస్ కు ఆర్ డి ఓ ఆఫీస్ కు విన్నపాలు.. పట్టించుకునే నాధుడే కరువు
అడుగడుగునా నిర్లక్ష్యం..

ఈరోజు న్యూస్, సంగారెడ్డి :
వినతి పత్రాలు ఇస్తే సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి అధికారులు ఇచ్చిన వినతి పత్రాలకు కూడా సమాధానం ఇవ్వకుండా కనీసం చూడకుండా బుట్ట దాఖలు చేసిన పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో నెలకొంది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి సంబంధించి 44 ఎకరాల భూమి పిటి కౌలుదార్ చట్టం కింద 1950 లో దాదాపు 15 మంది లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ బ్రతుకుతున్న సమయంలో జాస్తి సుబ్బారావు అనే ఒక పొలిటికల్ లీడర్ వ్యవసాయాన్ని ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్న పరిస్థితుల్లో చేసేది లేక రెవెన్యూ అధికారులను పోలీసు అధికారులను కలెక్టర్ ను వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయి ఆర్తనాదాలు చేసిన పట్టించుకునే నాధుడు లేడని భూమి తమ పరిధిలో లేదు కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో గ్రామంలో నివసిస్తున్న ఎస్సీ రైతులు తమ గోడు వినే నాధుడు లేడని పత్రాలు ఇవ్వడం ఆపేశారు 1974లో కౌలు రైతులకు ఆర్ ఓ ఆర్ ఇచ్చి తిరిగి దాన్ని క్యాన్సిల్ చేసి , రైతుల పేర్లు తీసివేసి జాస్తి సుబ్బారావు కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే రాయడంతో రైతులు చేసేది లేక ఆ భూమి చుట్టూ తిరుగుతూ కోర్టులను ఆశ్రయించి వారితో పోరాటం చేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా కౌలు రైతులకు తెలియకుండా మాభూమి అంటూ వచ్చి సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను చూసి నువ్వు యజమానుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. గతంలో 1997 లో తాసిల్దార్ కి 2007లో ఆర్డీవోకి 2017 2019, 2019లోనే అప్పటి కలెక్టర్కు వినతి పత్రం 2017 లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దాదాపు కలెక్టర్కు మూడుసార్లు ఆర్డీవో ఒక రెండు సార్లు తాసిల్దార్లకు 8సార్లు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయారు కానీ పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ భూమి మాది మాకు అప్పగించండి అని పదే పదే చెప్పినప్పటికీ అధికారులు ల్యాండ్ ఓనర్ల పేరిట రికార్డులు మార్చి వేశారు గతంలో జాస్తి సుబ్బారావు పేరిట వారి కుటుంబ సభ్యుల పేరిట భూమి రికార్డులు మారాయి . కోర్టులో కేసు ఉండగానే రైతుల పేరు మీద ఉన్న భూమి మరొకరికి అమ్మడానికి తెలుస్తోంది మాకు సంబంధించిన స్థలం అనన్యకాంతం అవుతుందని కౌలుదారుకి తెలిసినప్పటికీ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు అధికారుల నిర్లక్ష్యం మూలంగా మాకు జరగాల్సిన మేలును డబ్బులు బాగా కలిగిన వాళ్లకు వీలు చేస్తూ వారి లబ్ధి కోసం ఎంతటి పనినైనా చేసి పెట్టేందుకు తాసిల్దార్లు ఆర్డీవోలు ముందు వరుసలో ఉంటారు కానీ తాసిల్దార్ లో చెప్పిన మాట మాత్రం ఒకటే కోర్టుకు వెళితే పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పడంతో రైతులు ఆలోచనలో పడ్డారు. అసలు వచ్చినప్పుడు ఎదుర్కొనే మనుషులు లేకపోవడం వల్ల చాలామంది ఇప్పటికే కనుమూసిన పరిస్థితుల్లో అధికారానికి తాసిల్దారులు తలవంచి భూమిని కట్టబెట్టేందుకు పూర్తి కసరత్తులు చేస్తున్నట్టు తేటతెల్లమవుతుంది.

