తెలంగాణముఖ్యాoశాలు
గవర్నర్ తమిళిసై కి సీఎం కేసీఆర్‌కు, మధ్య రెండేళ్లుగా దూరం

సీఎం కేసీఆర్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య గత రెండేళ్లుగా దూరం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం ప్రొటోకాల్ కల్పించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారు. గవర్నర్ తల్లి చనిపోయినా సీఎం కేసీఆర్ పరామర్శించలేదు. ప్రొటోకాల్ విషయంలో గవర్నర్ పలుమార్లు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఢిల్లీ కేంద్రంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దర్బార్, వరద ముంపు ప్రాంతాల సందర్శన, బాసర ట్రిపుల్ ఐటీ సందర్శన, విద్యార్థులతో సమావేశం.. పలు కార్యక్రమాలను గవర్నర్ చేపడుతున్నారు.ఇంతకుముందు చివరిగా ఎట్ హోం కార్యక్రమాన్ని 2020 జనవరి 26న నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్ కారణంగా రెండేళ్లుగా జరగలేదు. రెండేళ్ల తరువాత జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండడంతో దూరం మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఎంపికైన 75 మంది విద్యార్థులకు రాజ్‌భవన్‌లో సోమవారం గవర్నర్ తమిళిసై అవార్డులు, ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ... నేటి విద్యార్థులు భవిష్యత్ తెలంగాణకు పిల్లర్లు అని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతీయులకు పిన్ను తయారు చేసుకోవడం రాదని బ్రిటి్‌షవారు అన్నారని, కానీ.. స్వతంత్ర భారతంలో అంతరిక్షంలోకి ప్రయాణం చేశామని గవర్నర్ తెలిపారు.




