అంతర్రాష్ట్ర నకిలీ భారతీయ కరెన్సీ చలామణి ముఠాఅరెస్ట్ చేసిన మీర్ చౌక్ పోలీసులు

మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MGBS అవుట్ గేట్ వద్ద దొంగనోట్లు చలామణి చేస్తున్నఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు వీరిదగ్గర నుండి సుమారు రెండు లక్షల ఏబై వేలు రూపాయల దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ కేసు లో ప్రధాన నిందితుడు కర్ణాటక రాష్ట్రం హుల్సూర్ చెందిన ‘శేఖర్’ తన స్వస్థలంలో NS కంప్యూటర్లు మరియు జిరాక్స్ సెంటర్ నడుపుతూ తన జీవితాన్ని నడిపిస్తున్నాడు. అయితే అక్రమ మార్గాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రించే ఉద్దేశ్యంతో ప్రణాళిక ప్రకారం అవసరమైన అన్ని పరికరాలను సేకరించి నకిలీ కరెన్సీ ముద్రించడం ప్రారంబించి తన గ్రామానికి చెందిన సమీప బంధువు సయ్యద్ అన్సార్ తో కలసి నకిలీ నోట్లు చలామణి చెయ్యడం ప్రారంభించాడు. ఈక్రమం లో మహారాష్ట్రకు చెందిన షేక్ ఇమ్రాన్‌కి MGBS గేట్ వద్ద దొంగనోట్లను విక్రయిస్తుండగా మాటు వేసిన పోలీసులు చాక చక్యం గా వారిని పట్టుకొని దొంగనోట్లను స్వాధీనం
చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు డినామినేషన్లు 100, 200, 500 మరియు 2000 నోట్లు అన్నీ కలిపి మొత్తం రూ. 2,50,000/- ఉన్నాయి
శ్రీమతి స్నేహ మెహ్రా, IPS., I/c ADCP, టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్, హైదరాబాద్. పర్యవేక్షణలో పై అరెస్టులు జరిగాయి. ఈదాడులలో శ్రీ. S. రాఘవేంద్ర, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సౌత్ జోన్, శ్రీ M. అప్పల నాయుడు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మీర్చౌక్ PS , SIలు S/శ్రీ N. శ్రీశైలం, V. నరేందర్, K. నర్సిములు, షేక్ బురాన్ & స్టాఫ్ ఆఫ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులతో పాటు హైదరాబాద్ సిటీ పోలీసులు పాల్గొన్నారు.




