తెలంగాణముఖ్యాoశాలు
రామంతపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి సూసైడ్ యత్నం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రైవేట్ కాలేజీలకు ఒక జీవో విడుదల చేసి ఆపై వారిని పిలిచి ఏ విద్యార్థిని ఇబ్బంది పెట్టద్దని మరీ మరీ చెప్పిన నారాయణ కాలేజీ వారు చేసిన పనికి మరోసారి విద్యార్థి బలి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది రామంతపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి చదువుతున్న సాయి నారాయణ అనే విద్యార్థి చదువు పూర్తి కావడంతో ఎంసెట్ రాయడానికి లేదా మరో చదువుకి వెళ్లడానికి మార్కు లిస్ట్ అవసరం కాబట్టి మార్కు లిస్టులు అడగగా కాలేజీ ప్రిన్సిపల్ ఫీజులు బాకీ ఉన్నాయని ఇవ్వడం కుదరదని దాదాపు మూడు నెలల నుండి తిప్పుతూ విద్యార్థికి జీవితం పైన విరక్తి పుట్టే విధంగా ప్రవర్తించారు ఇదే సమయంలో విద్యార్థి నాయకుడు సందీప్ తీసుకొని ప్రిన్సిపాల్ మరియు ఆ కాలేజీలో పని చేసే మరో వ్యక్తి ఇద్దరు ఉన్న రూమ్ లోకి వెళ్లి మరోసారి ఈ రిక్వెస్ట్ చేయగా వారు తిరస్కరించడంతో సందీప్ తన జేబులో నుంచి పెట్రోల్ తీసి పోసుకొని నిరసన వ్యక్తం చేశారు వెంటనే అక్కడ అప్పటికే పూజ చేసి ఉండడంతో పెట్రోల్ ఆ దీపానికి మరింత అగ్గితోడై ప్రిన్సిపాల్ కు మరియు ప్రిన్సిపాల్ తో ఉన్న మరొకరికి మంటలతో గాయాలయ్యాయి గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు




