Allఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలు
తిరుమలలో మంత్రి హరీశ్‌రావుకు అవమానం ? కనిపించని ప్రోటోకాల్‌తో హరీష్ అవాక్కు

తిరుమల: తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు తిరుమలలో అవమానం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారమే తిరుమల చేరుకున్నారు. ఓ రాష్ట్ర మంత్రిగా ఆయనకు లభించాల్సిన టీటీడీ ప్రొటోకాల్‌ను కల్పించడంలో అధికారులు విఫలం చెందారు. దీంతో అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన హరీశ్‌రావు స్వామి దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు.
హరీశ్‌రావుకు అవమానం జరిగిందంటూ వార్తలు వెలువడటంతో టీటీడీ అప్రమత్తమైంది. టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్, హరీశ్ రావుకు హరీశ్‌రావుకు సర్దిచెప్పారు. భక్తుల రద్దీ, వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో పాటు, హరీశ్ రాకపై పూర్తి సమాచారం లేనందునే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. అనంతరం హరీశ్‌రావును దగ్గరుండి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు.
తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ధనుర్మాస కైంకర్యాల అనంతరం వైకుంఠ ద్వారాలు తెరచుకోగా, 5 గంటల నుంచి సామాన్య భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.




