తెలంగాణముఖ్యాoశాలు

స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు యత్నాలు.. అడ్డుకున్న జగ్గారెడ్డి….వృధా ప్రయాస

సదాశివపేట స్పిన్నింగ్ మిల్ కార్మికుల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు

చేస్తున్నారు. 30 ఏళ్లుగా మూతపడిన పరిశ్రమలో కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే మూతపడిన

పరిశ్రమ స్థలాన్ని ఇద్దరు పారిశ్రామిక వేత్తలు వేలంలో కొనుగోలు చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న కార్మిక

కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. అడ్డుకోబోయిన కార్మికులను పోలీస్

స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన

సంఘటన ప్రదేశానికి చేరుకుని కూల్చివేత ప్రక్రియను అడ్డుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు

అండగా ఉంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.జగ్గారెడ్డి గతంలో చాలామందికి హామీలు ఇచ్చారు వేల మందికి భరోసా

కల్పించారు కానీ ఎవరికి కూడా న్యాయం చేయలేదు. అప్పుడు వస్తారు వెళ్ళిపోతారు మరలా కానరారు  ఆయనకు ఏదైనా

వస్తుందంటేనే అక్కడికి వెళ్తారు పది రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తాయి అని ఆలోచించే ఈయనను  నమ్ముకుని

ఎవరు ఎన్ని చేసినా అన్ని వృధా ప్రయాస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker